CM Jagan: నెల్లూరు జిల్లా వైకాపాలో ముసలంపై సీఎం జగన్‌ దృష్టి

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల నేపథ్యంలో సీఎం జగన్‌తో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు భేటీ అయ్యారు.

Updated : 01 Feb 2023 16:13 IST

తాడేపల్లి: నెల్లూరు జిల్లా వైకాపా(YSRCP)లో ముసలంపై సీఎం జగన్‌ (CM JAGAN)దృష్టి సారించారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల నేపథ్యంలో సీఎం జగన్‌తో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు భేటీ అయ్యారు. వైకాపా ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి తీరుపై భేటీలో చర్చించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. నెల్లూరు గ్రామీణ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి కోటంరెడ్డిని తప్పించే అవకాశమున్నట్టు సమాచారం. కోటంరెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై సీఎం జగన్‌ చర్చించారు.

నెల్లూరు జిల్లాలో అధిష్ఠానం తీరుపై వైకాపా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి అధిష్ఠానం తీరుపై బాహాటంగా విమర్శలు చేయగా.. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని తనకి లేదని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్‌ ట్యాప్‌ (Phone Tapping) చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. బుధవారం నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు సహా సొంత పార్టీ నేతలను ఉద్దేశించి కోటంరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని