CM Jagan: ఏం చేద్దాం?.. వైకాపా ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసర భేటీ

వైకాపా ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు.  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు.

Updated : 20 Apr 2023 10:59 IST

అమరావతి: వైకాపా ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు.

సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు రద్దుతో పాటు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ ముందు హాజరు కానుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు అవినాష్‌ పులివెందుల నుంచి హైదరాబాద్‌ బయల్దేరినపుడు ఆయనతో పాటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ఆ సమయంలో ఈ కేసుపై అవినాష్‌తో చర్చించిన అంశాలను సీఎం జగన్‌కు చెవిరెడ్డి వివరించనున్నట్లు సమాచారం. మరోవైపు అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? పార్టీ తరఫున ఎలా ముందుకెళ్లాలి? తదితర అంశాలపై నేతలతో జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని