Revanth Reddy: మా ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే.. మాడి మసైపోతావ్‌: కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ ఫైర్‌

కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.

Updated : 19 Apr 2024 16:50 IST

మహబూబ్‌నగర్‌: షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు.. అది పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారాస అధినేత కేసీఆర్‌ (KCR) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే.. మాడి మసైపోతావు. పాలమూరులో అనేక ప్రాజెక్టులు చేపట్టాం. పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా భారాసకు ఓటు వేయాలి?’’ అని రేవంత్ ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని