CM Revanth: తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్‌ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది.

Updated : 04 Apr 2024 19:57 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఏప్రిల్‌ 6న తుక్కుగూడ వేదికగా ప్రచార శంఖం పూరించనుంది. ‘జన జాతర’ పేరుతో నిర్వహించనున్న ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ  సహా పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో తుక్కుగూడ సభపై మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్‌.. సభా ప్రాంగణానికి వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. తెలంగాణ గడ్డపై ప్రకటించే కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో భారతావని దశ దిశ మార్చనుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని