Congress: తుది దశకు టీఎంసీ, ఆప్‌తో చర్చలు.. సీట్ల సర్దుబాటు కొలిక్కి!

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కలిసి పోటీ చేసే అంశంపై తృణమూల్‌  (TMC), ఆప్‌ (AAP)తో చేస్తున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Published : 23 Feb 2024 21:58 IST

దిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కలిసి పోటీ చేసే అంశంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC), ఆప్‌ (AAP)తో చేస్తున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని కాంగ్రెస్‌ వెల్లడించింది. త్వరలోనే ఇవి ఖరారు కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో ఓ అవగాహన కుదిరిన వేళ.. ఇతర రాష్ట్రాల్లోనూ భాగస్వామ్య పక్షాలతోనూ సంప్రదింపులను కాంగ్రెస్‌ ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

సీట్ల సర్దుబాటు అంశంపై అరవింద్‌ కేజ్రీవాల్‌తో చేస్తోన్న చర్చలు దాదాపు పూర్తయినట్లేనని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దిల్లీ, గుజరాత్‌లలో పోటీపై అవగాహన కుదిరినట్లు తెలిపాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌తో మాత్రం సంప్రదింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి. ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటును అగ్రనాయకత్వం త్వరలోనే పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.

అస్సాంలో రెండు లోక్‌సభ స్థానాలు, మేఘాలయాలో ఒక చోట పోటీ చేసేందుకు తృణమూల్‌ ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. అయితే, మేఘాలయ సీటును వదులుకునేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదని.. దీనిపై సుదీర్ఘ మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని