Women issues: పదేళ్ల ‘రిపోర్టు కార్డ్‌’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్‌ ప్రశ్న

మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

Published : 29 Mar 2024 00:15 IST

దిల్లీ: మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మహిళా, శిశుఅభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. గడిచిన పదేళ్లలో ఆ శాఖ ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని డిమాండ్‌ చేసింది. మహిళా సమస్యలపై కాంగ్రెస్‌ నేతలు ఇటీవల అనేక ప్రశ్నలు సంధించినప్పటికీ.. వాటిలో ఏ ఒక్కదానికీ కేంద్ర మంత్రి స్పందించలేదని తెలిపింది.

‘మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి గడిచిన పదేళ్లలో సాధించిన రిపోర్టు కార్డును మీడియా ముందు వెల్లడిస్తారని అనుకున్నాం. కానీ, అందుకు ఆమె నిరాకరిస్తున్నారు. అందుకే ఆమెను జవాబుదారీగా ఉంచాలని నిర్ణయించాం’ అని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అల్కా లాంబా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఇటీవల అడిగిన ప్రశ్నలను లాంబా మరోసారి ప్రస్తావించారు.

జైలు నుంచి కేజ్రీవాల్‌ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు

‘దేశంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగాయా? ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పటికీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు? మణిపుర్‌లో గిరిజన మహిళలపై అఘాయిత్యాలు జరిగి ఆరునెలలు గడిచినా.. ఆ కేసును ఏ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారిస్తోంది? నిందితులకు శిక్ష పడిందా? హరియాణాలో లైంగిక ఆరోపణలు వచ్చిన హర్దీప్‌ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పటికీ ఆయన ఇంకా మంత్రిగానే ఎందుకు కొనసాగుతున్నారు? అని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని