Kejriwal: జైలు నుంచి కేజ్రీవాల్‌ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది.

Updated : 28 Mar 2024 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు చెప్పింది. అందుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులు ఏంటని ప్రశ్నించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

మద్యం కేసులో కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసినందున ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని సుర్జీత్‌ సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి దిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆచరణాత్మక ఇబ్బందులు ఉండవచ్చు.. కానీ, సీఎంగా కొనసాగడానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకి ఏంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

ఇదిలాఉంటే, దిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌.. జైలు నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ.. దిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ కొనసాగుతారని ఆప్‌ నేతలు చెబుతున్నారు. ఇలా దిల్లీ ప్రభుత్వం జైలు నుంచి నడవదు అని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని