Congress-AAP: నాలుగు చోట్ల ఆప్‌.. మూడు చోట్ల కాంగ్రెస్‌: దిల్లీలో సీట్లసర్దుబాటు కొలిక్కి..!

దిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో పోటీ చేసే విషయంలో కాంగ్రెస్‌-ఆప్‌(Congress-AAP) ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. 

Updated : 22 Feb 2024 13:18 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు రానున్న వేళ కాంగ్రెస్‌-ఆప్‌(Congress-AAP) మధ్య సీట్ల సర్దుబాటు(seat sharing ) చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దిల్లీ(Delhi)లోని ఏడు ఎంపీ స్థానాల్లో నాలుగు చోట్ల ఆప్‌, మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. దీనిపై త్వరలో ప్రకటన వెలువడనుంది. 

తమ రెండు పార్టీల మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయని కొద్దిరోజుల క్రితం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ‘రెండుమూడు రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది’ అని వ్యాఖ్యానించారు. మొదట పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఆప్‌ ఒక్క సీటే ఆఫర్ చేసింది. ‘దాని ప్రదర్శన చూస్తే.. దిల్లీలో ఒక్క సీటే ఎక్కువ. పొత్తు ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఒక్కటీ ప్రతిపాదించాం’ అని ఆప్‌ ఎంపీ సందీప్‌ పాథక్ గతంలో వ్యాఖ్యలు చేశారు. దాంతో రెండింటి మధ్య పొత్తు కుదరకపోవచ్చనే వార్తలు వినిపించాయి. కాగా..2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ ఏడు ఎంపీ సీట్లను భాజపానే సొంతం చేసుకుంది.

మా బ్యాంకు ఖాతాల నుంచి అక్రమంగా రూ.65 కోట్లు తీసుకున్నారు

ఇదిలా ఉంటే.. బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో విపక్ష ఇండియా (కూటమి)లో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. యూపీలో 80 స్థానాలకు గానూ 17 చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. మిగిలిన 63 చోట్ల సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), ఇతర మిత్రపక్షాలు బరిలో దిగుతాయి. కాంగ్రెస్‌ పోటీ చేసే స్థానాల్లో రాయ్‌బరేలీ, అమేఠీ, వారణాసి, ఝాన్సీ, మథుర, గాజియాబాద్‌ వంటివి ఉన్నాయి. ప్రతిష్టంభనను తొలగించడానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చొరవ తీసుకున్నారు. ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్‌తో ఆమె ఫోన్లో మాట్లాడడంతో పొత్తుకు మార్గం సుగమమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని