Congress - CPI: ఆ మూడు స్థానాలు ఇస్తే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమే: కూనంనేని

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పొత్తుల కోసం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

Published : 27 Aug 2023 16:08 IST

హైదరాబాద్‌: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పొత్తుల కోసం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో చర్చలు జరపగా.. తాము పోటీ చేసే స్థానాలను ఆయన కాంగ్రెస్‌ దృష్టికి తీసుకెళ్లారు. బెల్లంపల్లి, హుస్నాబాద్‌, కొత్తగూడెం, మునుగోడు స్థానాలను ఆయన కోరారు. ఇందులో మూడు స్థానాలను కేటాయిస్తే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు సిద్ధమని సాంబశివరావు చెప్పినట్టు సమాచారం.

పొత్తులు, సీట్ల సర్దుబాటుపై సీపీఎం చర్చలు

మరోవైపు, సీపీఎం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గం ఇవాళ సమావేశమైంది. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవి.రాఘవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సాయంత్రం వరకు ఈ కార్యవర్గ సమావేశం కొనసాగింది. భారాసతో పొత్తు తెగదెంపుల నేపథ్యంలో.. సీపీఐతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే సీపీఎం నిర్ణయించింది. పొత్తులు, సీట్ల సర్దుబాటు సహా వివిధ అంశాలపై కార్యవర్గ సమావేశంలో నేతలు చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని