Anurag Thakur: ‘హిమాచల్‌’ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుకు కారణం అదే.. అనురాగ్ ఠాకూర్‌

హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటంపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు.

Updated : 28 Feb 2024 17:53 IST

దిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha Elections) జరిగిన క్రాస్‌ ఓటింగ్‌తో హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అక్కడి సంక్షోభ పరిస్థితులపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) దిల్లీలో స్పందించారు. కాంగ్రెస్ సారథ్యంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందడంతో 14 నెలల వ్యవధిలోనే ప్రజలకు విసుగు వచ్చేసిందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌కు చెందని వ్యక్తిని పోటీకి దింపడంపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సొంత పార్టీ అభ్యర్థికే వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు.  నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ భాజపా అభ్యర్థి హర్ష్‌ మహజన్‌ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 

సంక్షోభం వేళ ‘రాజీనామా’ వార్తలు.. స్పందించిన హిమాచల్‌ సీఎం

‘‘హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజల్లో, ఎమ్మెల్యేల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఆ కోపాన్ని రాజ్యసభ ఎన్నికల్లో ఇలా చూపించారు. కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి స్పష్టంగా కనిపిస్తోంది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాకు మధ్య ఓట్ల తేడా కేవలం 0.9 శాతమే’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని