Revanth reddy: జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి

పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. 

Published : 29 Mar 2024 19:47 IST

హైదరాబాద్‌: పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే కొందరికి నామినేటెడ్‌ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన పీఈసీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 శ్రీధర్‌బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీకి సలహాలు ఇవ్వాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను నియమించి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏఐసీసీ మేనిఫెస్టోలోని 5 న్యాయ్‌ గ్యారంటీల ప్రచారాన్ని విస్తృతం చేస్తూ.. కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌ పనులను మేనిఫెస్టోలో చేర్చాలన్నారు. దేశంలో తెలంగాణ మోడల్‌ పాలన బాగుందని జాతీయ నాయకత్వం కితాబు ఇవ్వడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలిపించాలి.. ప్రజల్లో మంచి స్పందన ఉందని నేతలకు వివరించారు.  రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, నామినేటెడ్‌ పోస్టుల్లో పదవులు పొందిన వారిని అభినందిస్తూ తీర్మానం చేశారు.

92శాతం మందికి రైతు బంధు ఇచ్చాం: భట్టి విక్రమార్క

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... వంద రోజుల పాలన పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందన్నారు. ‘‘ ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. మనం దేశంలోనే మంచి ఫలితాలు అందించాలి. వందరోజుల పాలన పట్ల ప్రజల్లో ఉన్న స్పందనను ప్రచారంలో వాడుకోవాలి. రైతు బంధు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 92శాతం మంది రైతులకు రూ. 5,500 కోట్ల మేర రైతు బంధు పంపిణీ చేశాం’’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని