Congress: లోక్‌సభ ఎన్నికల బరిలో కన్నయ్య కుమార్‌, చన్నీ

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసింది. 

Published : 14 Apr 2024 22:23 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు (Lok sabha Elections) కాంగ్రెస్‌  పార్టీ మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా 10 మందితో మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, కన్నయ్య కుమార్‌లకు చోటు దక్కింది. ఆదివారం రాత్రి ఏఐసీసీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ప్రకారం.. కాంగ్రెస్‌ యువనేత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను దిల్లీ నార్త్‌ ఈస్ట్‌ సీటు నుంచి పోటీలో దించింది. ఇక్కడ భాజపా నుంచి సీనియర్‌ నేత మనోజ్‌ తివారీ బరిలో ఉన్నారు. అలాగే, చాందినీ చౌక్‌ నుంచి పార్టీ సీనియర్‌ నేత జేపీ అగర్వాల్‌; నార్త్‌ వెస్ట్‌ దిల్లీ నుంచి మాజీ ఎంపీ ఉదిత్‌రాజ్‌ పోటీ చేయనున్నారు.

ఆ సీఎం ఓ కీలుబొమ్మ.. అధికారం కల్పన చేతుల్లోనే: భాజపా నేత ఆరోపణలు

ఇకపోతే, పంజాబ్‌లో అమృత్‌ సర్‌ నుంచి గుర్జీత్‌ సింగ్‌ ఔజ్లా పోటీ చేస్తుండగా.. జలంధర్‌ (ఎస్సీ) నుంచి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, ఫతేగఢ్‌ సాహిబ్‌ (ఎస్సీ) నుంచి అమర్‌ సింగ్‌, భటిండా నుంచి జీత్‌ మొహిందర్‌ సింగ్‌ సిద్ధూ, సంగ్రూర్‌ నుంచి ఆల్‌ ఇండియా కిసాన్‌ విభాగం చీఫ్‌ సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా, పటియాలా నుంచి డా. ధరమ్‌వీర్‌ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ నుంచి ఉజ్వల్‌ రేవతి రమన్‌ సింగ్‌ను పోటీలో దించింది. వీరితో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు 75మంది అభ్యర్థులతో వేరేగా జాబితాను ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని