Lok Sabha Elections: పాక్‌ వద్ద అణ్వస్త్రాలున్నా.. నిర్వహణకు డబ్బుల్లేవు కదా! - మోదీ

తొలి నాలుగు విడతల పోలింగ్‌లో ‘ఇండియా’ కూటమికి చుక్కెదురైందని, దీంతో నిరాశలో కూరుకుపోయిన కార్యకర్తలు ఇంటినుంచే బయటకు రావడం మానేశారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

Updated : 17 May 2024 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పాకిస్థాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని చెబుతోన్న కాంగ్రెస్‌ (Congress).. వాటి నిర్వహణకు ఆ దేశం వద్ద డబ్బులే లేవన్న విషయాన్ని గుర్తించలేకపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కేవలం 50 సీట్లే గెలవడాన్ని హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని, తద్వారా తన గౌరవాన్ని కాపాడుకోవచ్చని భావిస్తోందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌, ఫతేహ్‌పుర్‌లలో నిర్వహించిన ప్రచార సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. తొలి నాలుగు విడతల పోలింగ్‌లో ‘ఇండియా’ కూటమికి చుక్కెదురైందని, దీంతో నిరాశలో కూరుకుపోయిన కార్యకర్తలు ఇంటినుంచే బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు.

వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: మోదీ ధ్వజం

‘‘ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య అనేక పోలికలు ఉన్నాయి. ఈ రెండూ కుటుంబవాదాన్ని ప్రోత్సహిస్తాయి. అవినీతిమయ రాజకీయాల్లో నిమగ్నమయ్యాయి. ఓటుబ్యాంకును ఆకట్టుకునేందుకు దేనికైనా వెనుకాడవు. ఉగ్రవాదులు, మాఫియా, నేరగాళ్లకు సానుభూతి ప్రకటిస్తాయి. ‘ఆర్టికల్‌ 370’ను తిరిగి తెస్తామని హస్తం పార్టీ చెబుతోంది’’ అని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రజల ఓట్లను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన అనంతరం వారి ఆస్తుల్లో కొంత భాగాన్ని ఈ పార్టీలు తమ ఓటుబ్యాంకుకు పంచిపెడతాయని ఆరోపించారు. ఇదిలాఉండగా.. హమీర్‌పుర్‌, ఫతేపుర్‌ స్థానాలకు అయిదోవిడతలో భాగంగా ఈనెల 20వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని