Congress: ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్‌ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్‌

లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను జైపుర్‌లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేయనుంది.

Published : 28 Mar 2024 22:14 IST

జైపుర్‌: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections 2024) సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఏప్రిల్‌ 6న విడుదల చేయనుంది. జైపుర్‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ విడుదల చేస్తారని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ సుఖ్‌జిందర్‌ సింగ్ రంధ్వా తెలిపారు. పార్టీ వార్‌ రూమ్‌ భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఈ మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతోపాటు, 25 గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రకటించనుంది. ‘న్యాయ్‌ పిల్లర్ల’ పేరుతో 25 గ్యారంటీలను ఐదు భాగాలుగా విభజించింది. ‘పీపుల్స్‌ మేనిఫెస్టో’ పేరుతో దీని రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పంటకు కనీస మద్దత ధర చట్టం చేస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోలో దీనిపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు.

భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్‌ ఎంపీ

లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, రైతులకు హామీలు ఇచ్చింది. మహిళలకు ‘నారీ న్యాయ్‌’, రైతులకు ‘కిసాన్‌ న్యాయ్‌’పేరిట ఐదు గ్యారంటీలను ప్రకటించింది. నిరుద్యోగులకు ఉపాధి హక్కుతోపాటు, పరీక్ష పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం అంశాలను మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని