CPI Narayana: పొత్తులపై తెదేపా ఊగిసలాట వీడాలి: సీపీఐ నేత నారాయణ

పొత్తుల విషయంలో తెదేపా ఊగిసలాట వీడాలని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ సూచించారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు.

Updated : 30 Aug 2023 15:34 IST

దిల్లీ: పొత్తుల విషయంలో తెదేపా ఊగిసలాట వీడాలని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ సూచించారు. ఏపీలో వైకాపా, భాజపా కలిసే ఉన్నాయని.. ఇప్పటికైనా తెదేపా మేల్కొని ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయాలన్నారు. దిల్లీలో నారాయణ మీడియాతో మాట్లాడారు. తితిదే పాలకమండలిలో మద్యం వ్యాపారులకు చోటివ్వడం సరికాదని చెప్పారు. 

తెదేపా ‘ఇసుక సత్యాగ్రహం’.. దేవినేని ఉమా సహా పలువురు ముఖ్య నేతల అరెస్ట్

‘‘వైకాపా, భాజపా లివింగ్‌ టుగెదర్‌.. వాళ్లేమీ విడిపోరు. ఏపీలో భాజపా ఎంత కొట్లాడినా వైకాపాను ఓడించే పరిస్థితికి పోదు. రాష్ట్రానికి అన్నివిధాలుగా నష్టం చేసిన భాజపాకు తెదేపా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించడం మంచిది కాదు. సీపీఐ, సీపీఎం, జనసేనతో తెదేపా ఓ ఫ్రంట్‌ ఏర్పాటు చేయగలిగితే వైకాపా, భాజపా డబుల్‌ ఇంజిన్‌ ఫెయిల్‌ అవుతుంది. అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది’’ అని నారాయణ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని