Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు.. అర్ధరాత్రి హంగామా ఎందుకు?: సీపీఐ రామకృష్ణ

చంద్రబాబు అరెస్ట్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఏదైనా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు.

Updated : 09 Sep 2023 12:08 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఏదైనా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. పోలీసులు అర్ధరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. లోకేశ్‌ సహా తెదేపా నేతలను నిర్బంధించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. 

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలెప్‌మెంట్‌ కేసుకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. ఆయన అరెస్టును నిరసిస్తూ ఏపీవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పలువురు నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని