Vijayawada: సీఎం జగన్‌.. రాష్ట్ర ప్రయోజనాలు గాలికొదిలేశారు: రామకృష్ణ

విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తూ.. దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా సీఎం జగన్ చూస్తూ ఉండిపోయారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అసహనం వ్యక్తం చేశారు.

Published : 07 Oct 2023 16:19 IST

అమరావతి: స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల వ్యవహారంలో పునఃపంపిణీ నిర్ణయం కచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం చేయడానికేనని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్‌ ఉత్తరం రాసి ఊరుకున్నారే తప్ప దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తూ.. దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా చూస్తూ ఉండిపోయారని అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తక్షణమే స్పందించి అన్ని సంఘాలు, పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని