KTR: కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది.

Updated : 30 Mar 2024 15:12 IST

హైదరాబాద్‌: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి డబ్బులు పంపారని ఇటీవల కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారు. రూ.2,500 కోట్లు వసూలుచేసి అధిష్ఠానానికి పంపారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని