AP LOK SABHA: లక్షకుపైగా లీడ్‌తో దూసుకెళ్తున్న కూటమి ఎంపీ అభ్యర్థులు..

ఆంధ్రప్రదేశ్‌ పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. మొత్తం 25 స్థానాల్లో తెదేపా 16, వైకాపా 4, భాజపా 3, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Updated : 04 Jun 2024 13:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. మొత్తం 25 స్థానాల్లో తెదేపా 16, వైకాపా 4, భాజపా 3, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం) 1,81370, కేశినేని చిన్ని (విజయవాడ) 1,82,630, పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు) 1,79,824, జీఎం హరీశ్‌ (అమలాపురం) 1,65,178, శ్రీభరత్ (విశాఖ పట్నం) 1,62,181, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి (నెల్లూరు) 1,14,097, అనంతపురం 1,01,352 భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నారు.

భాజపా తరఫున రాజమహేంద్రవరం స్థానం నుంచి బరిలోకి దిగిన దగ్గుబాటి పురందేశ్వరి 2,19,688 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. నర్సాపురంలో భూపతిరాజు శ్రీనివాస వర్మ 2,12,681 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేశ్‌ 1,09,140 ఓట్ల లీడ్‌తో కొనసాగుతున్నారు. జనసేన తరఫున ఉదయ్‌ శ్రీనివాస్‌ (కాకినాడ) 1,10,237 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని