Devineni Uma: వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా

వైకాపాకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.

Updated : 17 May 2024 17:07 IST

అమరావతి: వైకాపాకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. వైకాపా కేబినెట్‌లో ఉన్న మంత్రులందరూ ఓడిపోతారని తెలిపారు. ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదన్న ఉమా.. జగన్‌రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైకాపా కార్యకర్తలు, ప్రజలను మభ్యపెట్టేందుకు సజ్జల ప్రయత్నిస్తూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. జగన్‌ లండన్ పారిపోతున్నారు.. పెద్దిరెడ్డి పీఎల్‌ఆర్‌ కంపెనీ వాహనాలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని అన్నారు. వైకాపా సోషల్‌ మీడియా దుకాణం సర్దుకుని సజ్జల భార్గవ్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయాడని దుయ్యబట్టారు. భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేశారు. అరాచకాలకు కారకులైన జగన్ తాబేదారులు.. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, జవహర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, అంజనేయులు లాంటి అధికారులు, నాయకులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని