Dhulipalla Narendra: ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల

అధికారులను మార్చిన చోటే ఘర్షణలు జరిగాయని వైకాపా ఆరోపిస్తోందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

Published : 20 May 2024 21:09 IST

అమరావతి: అధికారులను మార్చిన చోటే ఘర్షణలు జరిగాయని వైకాపా ఆరోపిస్తోందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడును వైకాపా నేతలు వల్లకాడు చేశారంటూ మండిపడ్డారు. కొందరు పోలీసులు వైకాపాతో కుమ్మక్కై తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. ఎవరు ఎవరిపై దాడి చేశారో వీడియోలు, ప్రజల సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. అధికారం కోల్పుతున్నామనే అక్కసుతోనే వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారని.. ఎన్నికల్లో గెలవాలని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఓటమి భయంతో ప్రతిపక్షాలు, పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. 

పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు ఉన్నా.. హింస ఆగట్లేదు!

హింసాత్మక ఘటనల్లో బలహీనవర్గాలకు చెందిన అధికారులను బలిపశువులు చేస్తున్నారని లిబరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ అన్నారు. ఈ అంశంపై ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. సీఎస్‌ నివేదిక మేరకు అధికారులపై చర్యలు సరికాదన్న ఆయన.. పోలీసులు, ఇంటెలిజెన్స్‌ ఉన్నా హింసాత్మక ఘటనలు ఆగట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి విచారణ చేయాలని కోరారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఎవరో ఒకరిని బలిచేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని