DK Shivakumar: సీఎం మార్పుపై చర్చ.. భాజపాపై డీకేఎస్‌ ఫైర్‌

కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో ఎలాంటి అసంతృప్తి లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. రాష్ట్రంలో భాజపాకు దిశానిర్దేశం చేసే నాయకులు కరవయ్యారని ఆయన విమర్శించారు. 

Updated : 03 Nov 2023 12:23 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రిని మారుస్తారనే ఊహగానాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) తోసిపుచ్చారు. ఈ క్రమంలో ఆయన భాజపాపై విమర్శలు చేశారు. అలాగే, కాంగ్రెస్‌ (Congress) పార్టీ నేతల్లో అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపాకు సరైన దిశానిర్దేశం చేసే నాయకులు కరవయ్యారని ఎద్దేవా చేశారు. శుక్రవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘మా పార్టీలో కాదు.. భాజపాలోనే అసంతృప్తి ఉంది. అందుకే ఇప్పటికీ అసెంబ్లీలో ఆ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ను ఎన్నుకోలేదు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పరిస్థితి ఉందా? ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా.. ప్రతిపక్ష పార్టీ తమ నాయకుణ్ని ఎన్నుకోలేదంటే.. ఆ పార్టీ నేతల్లో ఎంత అసంతృప్తి ఉందో అర్థమవుతుంది’’ అని డీకేఎస్‌ విమర్శించారు. 

అరె ఓ సాంబా! ఏం జరుగుతోంది?

గురువారం సీఎం మార్పుపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘‘ఎవరో చేసిన వ్యాఖ్యలకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? ఐదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుంది. నేను సీఎంగా ఉంటాను’’ అని అన్నారు. మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమిస్తారనే వార్తలపై స్పందిస్తూ.. ‘‘అలా అని మీకు ఎవరు చెప్పారు? కాంగ్రెస్‌ జాతీయ పార్టీ. అలాంటి నిర్ణయం ఏదైనా ఉంటే హైకమాండ్‌ చూసుకుంటుంది. అది సీఎం లేదా ఎమ్మెల్యేలు నిర్ణయించే అంశం కాదు’’ అని సిద్ధరామయ్య చెప్పారు. కర్ణాటకలో రెండున్నరేళ్ల తర్వాత సీఎంను మార్చుతారనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. దీంతో సీఎం సిద్ధరామయ్య గురువారం చేసిన వ్యాఖ్యలతో స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఇదే అంశంపై డీకే కూడా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని