Eatala Rajender: హుజూరాబాద్‌ కంటే గజ్వేల్‌లోనే అధిక మెజారిటీ వస్తుంది: ఈటల

ప్రజాస్వామ్య హక్కులు కాపాడేందుకు ఓటు ఏకే47 లాంటిదని గజ్వేల్‌ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు.

Updated : 07 Nov 2023 15:07 IST

గజ్వేల్‌: ప్రజాస్వామ్య హక్కులు కాపాడేందుకు ఓటు ఏకే47 లాంటిదని గజ్వేల్‌ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డితో కలిసి మంగళవారం గజ్వేల్‌లో ఈటల నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓడిపోవడం ఖాయమన్నారు. తనకు హుజూరాబాద్‌ కంటే గజ్వేల్‌లోనే అధిక మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 20 వేల మందికి ఫోన్‌ చేస్తే 50 వేల మంది వచ్చారని ఈటల హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని