Eatala Rajender: తొందర పడొద్దు.. మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు ఈటల సూచన

మాజీ మంత్రి, భాజపా నేత ఎ.చంద్రశేఖర్‌తో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.

Updated : 09 Jul 2023 17:25 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి, భాజపా నేత ఎ.చంద్రశేఖర్‌తో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. చంద్రశేఖర్  పార్టీని వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన ఈటల.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. భాజపాలో ఎదురైన ఇబ్బందులను ఈటలకు చంద్రశేఖర్ వివరించారు. పార్టీలో చేరి రెండున్నర ఏళ్లయినా ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. చంద్రశేఖర్, తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని, తమకు ఉమ్మడి ఎజెండా ఉందన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడం కోసం కలిసి పనిచేస్తామన్నారు. వరంగల్ రీజియన్ వరకే ప్రధాని మోదీ మీటింగ్‌ జరిగిందని.. అందువల్లే చంద్రశేఖర్‌కు పాస్‌ రాలేదన్నారు. అంతే తప్ప మరొకటి కాదన్నారు. పార్టీ బాగుండాలని ఈ భేటీలో చర్చ చేసినట్లు మాజీ మంత్రి చంద్రశేఖర్ చెప్పారు. పార్టీని ఎలా బాగుచేయాలో చెప్పానన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని