ECI: హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు.. సూర్జేవాలాకు ఈసీ షోకాజ్‌ నోటీసులు

భాజపా ఎంపీ, సినీనటి హేమమాలినిపై కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై ఈసీ స్పందించింది.

Published : 09 Apr 2024 18:48 IST

దిల్లీ: భాజపా ఎంపీ, నటి హేమమాలిని (Hemamalini)పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆమెపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసినందుకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ ప్రసంగాల సమయంలో మహిళల గౌరవాన్ని కాపాడేందుకు తమ సలహాలను కచ్చితంగా పాటించేలా తీసుకున్న చర్యలేంటో వివరించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను  కోరింది. 

నా కుమారుడు ఓడిపోవాలి.. కాంగ్రెస్‌ నేత ఏకే ఆంటోనీ వ్యాఖ్యలు

నేతలిద్దరూ తమ స్పందనలను తెలపాలని ఈసీ సూచించింది. సూర్జేవాలా ఏప్రిల్ 11 సాయంత్రంలోపు స్పందించాలని ఆదేశించిన ఈసీ.. ఖర్గేకు మరుసటి రోజు సాయంత్రం వరకు గడువు ఇచ్చింది. మరోవైపు, హేమమాలినిని అవమానించి, బాధపెట్టాలని తాను ఎన్నడూ అనుకోలేదని, తేదీ లేని వీడియోను ఎడిట్‌ చేసి వక్రీకరించారని సూర్జేవాలా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు