Election Commision: తెలంగాణలో ఎన్నికల కోడ్‌ ఎత్తివేత

తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎన్నికల కోడ్‌ను ఈసీ ఎత్తివేసింది.

Updated : 04 Dec 2023 20:17 IST

దిల్లీ: తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎన్నికల కోడ్‌ను ఈసీ ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌ 9న షెడ్యూల్‌ వెలువడిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 3న ఎన్నికల ప్రకటన జారీ కాగా, 10వ తేదీ వరకు నామపత్రాలను స్వీకరించారు. 13న నామపత్రాల పరిశీలన, 15న ఉప సంహరణ తర్వాత 30న పోలింగ్‌ జరిగింది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఫలితాలు వెలువడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎత్తివేత తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని