Andhra news: నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుంది. 

Published : 17 Apr 2024 20:46 IST

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుంది. దీంతో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్‌ 25 తుదిగడువు. 26న నామినేషన్ల పరిశీలన, 29వరకు ఉపసంహరణకు తుది గడువుగా పేర్కొన్నారు. 21వ తేదీ ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీ అభ్యర్థుల నుంచి కలెక్టర్‌ ఛాంబర్‌లో, ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి ఆయా రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు. నామినేషన్‌ వేసే వ్యక్తితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్వో ఛాంబర్‌లోకి అనుమతిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలకు మే 13న పోలింగ్‌ జరగనుంది. జూన్‌4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

అభ్యర్థులు ఒక్కొక్కరు  నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు సంబంధించి 200 మంది రిటర్నింగ్‌ అధికారులను వేర్వేరుగా నియమించారు. నామినేషన్లకు ఏడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆ లోగా దాఖలు చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ వేయనున్నట్టు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు