Errabelli comments: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో సంబంధం లేదు: మాజీ మంత్రి ఎర్రబెల్లి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, భారాస (BRS) నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Updated : 26 Mar 2024 17:05 IST

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, భారాస (BRS) నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు తనకు తెలియదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రణీత్‌రావు బంధువులు తమ ఊరిలో ఉన్నారని.. వారికి ఏ పార్టీతో సంబంధం ఉందో విచారణ చేస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీ మారాలంటూ కొందరి ద్వారా తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. 

తెదేపాలో ఉన్నప్పుడూ తెలంగాణ కోసం పోరాడానన్న ఎర్రబెల్లి.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి మచ్చ లేదని చెప్పారు. ఇరికించాలని ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. ఇబ్బంది పెట్టాలనే తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆక్షేపించారు. తనపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తెలియదన్నారు. భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని భాజపా నుంచి ఆయన్ను తొలగించినట్లు తెలిసిందని చెప్పారు. నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని.. అతడిపై ఎన్నో కేసులు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించవద్దని ఎర్రబెల్లి కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు