Harish Rao: హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్‌రావు

హామీలపై నిలదీస్తే సీఎం రేవంత్‌రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హారీశ్‌రావు విమర్శించారు.

Published : 20 Apr 2024 20:18 IST

హైదరాబాద్‌: హామీలపై నిలదీస్తే సీఎం రేవంత్‌రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హారీశ్‌రావు విమర్శించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి .. హోదాకు తగ్గట్టు మాట్లాడటం లేదని అన్నారు. సింగూరు జలాలను మెదక్‌కు దక్కేలా చేసింది కేసీఆరేనని చెప్పారు. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతుంటే.. రేవంత్‌ రెడ్డి మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ‘‘వెంకట్రామిరెడ్డి వేల ఎకరాలు లాక్కున్నారని అంటున్నారు. భూ సేకరణ చేస్తేనే లక్షల ఎకరాలకు నీరు అందుతోంది. రేవంత్‌ రెడ్డి తన పదవి కోసం ఎవరినైనా తొక్కుతారు’’ అని హరీశ్‌రావు విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని