birender singh: భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్

భాజపా నేత, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ తాను పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నానని సోమవారం తెలిపారు. 

Published : 08 Apr 2024 20:02 IST

దిల్లీ: భాజపా నేత, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ తాను పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నానని సోమవారం తెలిపారు. తన కుమారుడు బ్రిజేందర్ సింగ్ నెల రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. బీరేందర్ సింగ్ భార్య, హర్యానా భాజపా మాజీ ఎమ్మెల్యే ప్రేమలత సైతం భాజపాను వీడారు. 

దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీరేందర్ సింగ్ మాట్లాడుతూ ‘నేను భాజపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను.  2014-2019 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన నా భార్య ప్రేమలత కూడా రాజీనామా చేశారు. రేపు మేము కాంగ్రెస్‌లో చేరనున్నాం.’ అని తెలిపారు. బీరేందర్ సింగ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో పని చేసి, 10 సంవత్సరాల క్రితం భాజపాలో చేరారు. ఆయన కుమారుడు మార్చి 10న కాంగ్రెస్‌లో చేరిన అనంతరం బీరేందర్ సింగ్ కూడా పార్టీ మారనున్నారనే ఊహాగానాలు వచ్చాయి. కాని ఆయన వాటిని కొట్టిపడేశారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని