KTR: ఆర్గానిక్‌ పరిశ్రమలో పేలుడు.. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: హరీశ్‌రావు

ఆర్గానిక్‌ పరిశ్రమ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు, క్షతగాత్రులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated : 04 Apr 2024 14:04 IST

సంగారెడ్డి: ఆర్గానిక్‌ పరిశ్రమ పేలుడులో క్షతగాత్రులై ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, సునీత లక్ష్మారెడ్డి, మెదక్‌ భారాస అభ్యర్థి వెంకటరామరెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, క్షతగాత్రులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందినవారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సంస్థ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. తక్షణమే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి క్షతగాత్రులు ఎక్కడెక్కడున్నారో లెక్కతేల్చాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నందికొండ వాటర్‌ ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటన చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సుమారు రెండు వందల నివాస గృహాలకు తాగునీటి కోసం ఎన్నెస్పీ నీటి సరఫరా విభాగం ట్యాంకును నిర్మించింది. దాహం తీర్చుకోవటానికి ఈ ట్యాంకు వద్దకు వచ్చిన కోతులు అందులోకి దిగాయి. బయటికి రావటానికి అవకాశం లేకపోవటంతో మృత్యువాత పడ్డాయి. బుధవారం ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మున్సిపల్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. సుమారు 30 వానరాల కళేబరాలను బయటకు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని