AP News: సీఎం జగన్‌, ఎమ్మెల్యే మోసం చేశారంటూ.. వినూత్న నిరసన

సీఎం జగన్‌, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు.

Updated : 23 Jan 2024 16:37 IST

నరసాపురం: సీఎం జగన్‌, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. మాధవనాయుడు మాట్లాడుతూ... నరసాపురం ప్రజలను ఎమ్మెల్యే మూడు సార్లు మోసగించారన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ పదవికోసం జిల్లా కేంద్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. నరసాపురం నుంచి భీమవరానికి జిల్లా కేంద్రం, మెడికల్‌ కాలేజీ తరలించారని ఆరోపించారు. రూ.3,200 కోట్లతో అభివృద్ధి పనులు అంటూ ప్రజలను దగా చేశారని ధ్వజమెత్తారు. 14 నెలలు గడిచినా బటన్‌ నొక్కిన పనులు ప్రారంభం కాలేదని, సీఎం జగన్‌, ఎమ్మెల్యే మోసం చేశారని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని