Assembly Elections 2022: యూపీ, గోవా, ఉత్తరాఖండ్‌లలో కొనసాగుతున్న పోలింగ్‌

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌ సోమవారం ఉదయం ప్రారంభమైంది.

Updated : 14 Feb 2022 08:34 IST

లఖ్‌నవూ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌ సోమవారం ఉదయం ప్రారంభమైంది. గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒకే విడతలో పోలింగ్‌ పూర్తి కానుంది. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్‌లో భాగంగా మరికొన్ని స్థానాల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. అన్ని దశలకూ కలిపి ఓట్ల లెక్కింపును మార్చి 10న చేపట్టనున్న విషయం తెలిసిందే.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ దశలో 55 స్థానాలకు గానూ 586 మంది, గోవాలో 40 సీట్లకు గానూ 301 మంది, 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో 632 మంది అభ్యర్థులు బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని