KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్‌

భారాస అంటేనే.. భారతీయ రైతు సమితి అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 24 Mar 2023 11:35 IST

హైదరాబాద్‌ : భారాస అంటేనే.. ‘భారతీయ రైతు సమితి’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ఇటీవల వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు సహాయ పునరావాస చర్యల కింద సత్వరమే ఎకరాకు రూ. పదివేల ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. 

‘‘దేశంలో ఒక్క తెలంగాణలోనే మన అన్నదాతకు.. పెట్టుబడి కోసం రూ.పది వేలు, పంట నష్టపోతే రూ.పది వేలు. అందుకే మన రైతన్న మనోగతం ‘ఒక్క కేసీఆర్‌ సారు ఉంటే చాలు.. మాకు అదే పది వేలు’. వేరేటోళ్లను పొరపాటున నమ్మినా.. తెలంగాణ మళ్లీ వెనక్కి.. వందేళ్లు’’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు