40 ఏళ్లలో ఇలాంటి దాడులు చూడలేదు: యనమల

కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో అమ్మవారి జాతరలో జరిగిన ఘటనలో మృతి చెందిన దళిత యువకుడు రాము కుటుంబానికి, క్షతగాత్రులకు అండగా ఉంటామని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు భరోసానిచ్చారు.

Published : 31 Mar 2023 04:32 IST

తొండంగి, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో అమ్మవారి జాతరలో జరిగిన ఘటనలో మృతి చెందిన దళిత యువకుడు రాము కుటుంబానికి, క్షతగాత్రులకు అండగా ఉంటామని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు భరోసానిచ్చారు. తొండంగిలో మృతుడి కుటుంబాన్ని, శృంగవృక్షంలో క్షతగాత్రులను గురువారం ఆయన తెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యనమల కృష్ణుడితో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. 40 ఏళ్ల నుంచి సోదరభావంతో కలసిమెలసి ఉండే తుని నియోజకవర్గంలో ఇలాంటి దాడులు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. అనంతరం మృతుడు రాము కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కోడ వెంకటరమణ, పేకేటి హరికృష్ణ, చొక్కా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని