రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎంపీ కాదు..

లోక్‌సభ సభ్యుడు కాని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి న్యాయస్థానం ఎదుట హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వరాదని పేర్కొంటూ ఆరెస్సెస్‌ కార్యకర్త ఒకరు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Published : 01 Apr 2023 05:14 IST

కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు తగదు
పరువునష్టం కేసులో న్యాయస్థానానికి తెలిపిన ఆరెస్సెస్‌ కార్యకర్త

ఠానే: లోక్‌సభ సభ్యుడు కాని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి న్యాయస్థానం ఎదుట హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వరాదని పేర్కొంటూ ఆరెస్సెస్‌ కార్యకర్త ఒకరు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష నేపథ్యంలో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దైందని రాజేశ్‌ కుంటే అనే వ్యక్తి మహారాష్ట్రలోని భివాండి మేజిస్ట్రేట్‌కు తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమని రాహుల్‌ గాంధీ ఆరోపించడం ఆ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసిందని పేర్కొంటూ రాజేశ్‌ 2014లో పరువునష్టం దావా వేశారు. 2018 జూన్‌లో భివాండి కోర్టుకు హాజరైన రాహుల్‌ గాంధీ తాను తప్పు చేయలేదని తెలిపారు. ఎంపీ అయిన తనకు నియోజకవర్గంలో పర్యటించాల్సి రావడంతో పాటు పార్టీ నేతగా అనేక పనులుంటాయని తెలుపుతూ..కోర్టుకు హాజరుకావడం నుంచి మినహాయింపునివ్వాలని గత ఏడాది కోరారు. ఈ అభ్యర్థనపై తన వ్యతిరేకతను తెలియజేస్తూ రెండు రోజుల క్రితం రాజేశ్‌ కుంటే ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఎంపీ కాదని పేర్కొన్నారు. తదుపరి విచారణ ఏప్రిల్‌ ఒకటో తేదీకి వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని