అంబానీ, అదానీల కంటే జగన్‌ ధనికుడు

అంబానీలు, అదానీలు, టాటాలను తలదన్నే ధనికుడిగా మారిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఏరకంగా పేదల పక్షమో తెలియజేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.

Published : 07 Jun 2023 04:24 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల

ఈనాడు-అమరావతి: అంబానీలు, అదానీలు, టాటాలను తలదన్నే ధనికుడిగా మారిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఏరకంగా పేదల పక్షమో తెలియజేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేసినప్పుడే జగన్‌ ధనిక పక్షమని తెలిసిపోయింది. దళితుడైన సుబ్రహ్మణ్యంను హత్య చేసిన అనంతబాబుకు అండగా నిలబడినప్పుడే జగన్‌కు దళితులు దూరమయ్యారు’ అని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ‘ముందస్తు ఎన్నికలకు వైకాపా ఎందుకు భయపడుతోంది? ముందుగా ఎన్నికలకు వెళ్లడం లేదని పెద్దిరెడ్డి చెప్పడం... జగన్‌ భయపడి తోకముడిచినట్లు కాదా? ఎన్నికలపై ఎందుకు పేద, బీద పలుకులు పలుకుతున్నారు? వైకాపా మళ్లీ గెలిచే అవకాశం లేదని గ్రహించే ఒక్క రోజు కూడా అధికారాన్ని వదులుకోమని పెద్దరెడ్డి అంటున్నారు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని