Minister Dharmana: మన సీఎం జైలులో ఉండలేదా?: మంత్రి ధర్మాన

‘మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది రోజులు జైల్లో ఉండలేదా? తప్పు చేయలేదని ఆయన రేపోమాపో రుజువు చేసుకుంటారు.

Updated : 15 Oct 2023 07:57 IST

గార, న్యూస్‌టుడే: ‘మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది రోజులు జైల్లో ఉండలేదా? తప్పు చేయలేదని ఆయన రేపోమాపో రుజువు చేసుకుంటారు. ఎవరికైనా చట్టం ఒకటే’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. గార మండలంలో శనివారం గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న సందర్భంగా ధర్మాన మాట్లాడారు. ‘చట్టం దృష్టిలో అందరూ సమానమే. ప్రధానికైనా, ముఖ్యమంత్రికైనా మినహాయింపు ఉండదు. మాజీ సీఎం చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణ వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పాయి. అందుకే కేసులు నమోదుచేసి చంద్రబాబును జైలులో పెట్టారు. ఆయన దోషి అని మేమెప్పుడూ అనలేదు. నిర్దోషినని కోర్టులో నిరూపించుకోవాలి. గతంలో ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జయలలిత వంటి పెద్ద నాయకులూ కోర్టు ముందు నిలబడలేదా’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని