వైకాపా నాయకుల స్వలాభంతో పేదలకు అన్యాయం

కాసులకు కక్కుర్తి పడిన వైకాపా నాయకులు చౌడు నేలలు, క్వారీల బాంబ్‌ బ్లాస్టింగ్‌లు జరిగే ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మండిపడ్డారు.

Updated : 27 Nov 2023 05:14 IST

కనిగిరిలో జగనన్న కాలనీ దుస్థితిపై మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ధ్వజం

కనిగిరి, న్యూస్‌టుడే: కాసులకు కక్కుర్తి పడిన వైకాపా నాయకులు చౌడు నేలలు, క్వారీల బాంబ్‌ బ్లాస్టింగ్‌లు జరిగే ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మండిపడ్డారు. కనిగిరి పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో మోడల్‌ స్కూల్‌ సమీపంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని పార్టీ నాయకులతో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు. కాలనీకి వెళ్లే ప్రధాన రహదారితోపాటు అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉండటంతో వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ తన అనుచరుల భూములకు, ప్లాట్లకు ధరలు వచ్చేందుకే అటవీ ప్రాంతంలో కాలనీ ఏర్పాటు చేయించి పేదలకు అన్యాయం చేశారని ఆరోపించారు. చిన్న పాటి వర్షం కురిసినా రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయని, తెలుగు మహిళలు గుంతల్లో మొక్కలు నాటి నిరసన తెలిపారు. కాలనీలో చెరువులా మారిన ఖాళీ స్థలాల్లో నాయకులు జల దీక్ష చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని