వైకాపా గద్దె దిగకుంటే ప్రజలకు కష్టాలే

ప్రభుత్వ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పీఎఫ్‌ చెల్లింపులు ఆగిపోయాయని, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులూ అందడం లేదని విమర్శించారు.

Published : 29 Nov 2023 06:02 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ఈనాడు, విజయనగరం: ప్రభుత్వ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పీఎఫ్‌ చెల్లింపులు ఆగిపోయాయని, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులూ అందడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితి చూస్తే రాష్ట్రం ఎంతమేర అప్పుల ఊబిలో కూరుకుపోయిందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా గద్దె దిగకుంటే ప్రజలకు కష్టాలేనని పేర్కొన్నారు. విజయనగరంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ‘కనీసం పథకాలను సక్రమంగా అమలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకే తమ పేర్లు పెట్టుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి స్టిక్కర్ల ప్రభుత్వం అని పేరు మార్చాం. సీఎంతో పాటు వైకాపా నాయకులంతా అవినీతిలో కూరుకుపోయారు. కేంద్రం ఏటా రూ.కోట్ల మేర నిధులిస్తున్నా అభివృద్ధి కనిపించడం లేదు. విజయనగరం జిల్లాలో ఇసుక, మాంగనీస్‌ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. పెద్దఎత్తున భూబకాసురులు ఉన్నారు’ అని పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలోని హామీల అమలుకు భాజపా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని