భాజపా విజయం భవిష్యత్తుకు దిక్సూచి

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం భవిష్యత్తు ఫలితాలకు దిక్సూచిగా నిలవనుందని జనసేన అధినేత వపన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

Published : 04 Dec 2023 04:14 IST

తెలంగాణలో ఏర్పడనున్న ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం భవిష్యత్తు ఫలితాలకు దిక్సూచిగా నిలవనుందని జనసేన అధినేత వపన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. తెలంగాణలో విజయం సాధించిన భాజపా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా నాయకత్వ పటిమ, దేశానికి వారందిస్తున్న సేవలు ఈ గెలుపునకు దోహదం చేశాయని ఆదివారం ఓ ప్రకటనలో కొనియాడారు. ‘జనసేన అభ్యర్థులకు ఓటు వేసిన వారికి ధన్యవాదాలు. తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొన్న కాంగ్రెస్‌ నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అందజేస్తాం’ అని పవన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు