Telangana Elections: తొలి అడుగులోనే సంచలన గెలుపు

ఈనాడు, హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో (Telangana Elections 2023) కొందరు అభ్యర్థులు అనూహ్యంగా తొలిసారి అవకాశం దక్కించుకుని.. విజయాన్నీ సాధించారు. వీరిలో కొందరు రాజకీయాల్లో ఉద్దండులనూ మట్టికరిపించి సంచలనం సృష్టించారు.
- యశస్వినిరెడ్డి (26): పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మామిడాల యశస్వినిరెడ్డి బరిలో నిలిచి, ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఓడించారు.
 - మైనంపల్లి రోహిత్‌రావు (26): వైద్యుడైన రోహిత్(కాంగ్రెస్).. మెదక్‌లో అప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మా దేవేందర్‌రెడ్డి(భారాస)పై సంచలన విజయం సాధించారు.
 - చిట్టెం పర్ణికారెడ్డి (30): నారాయణపేట నుంచి రేడియాలజిస్ట్ చిట్టెం పర్ణికారెడ్డి(కాంగ్రెస్) వరుసగా రెండుసార్లు గెలిచిన రాజేందర్‌రెడ్డి(భారాస)పై విజయం సాధించారు.
 - వెడ్మా బొజ్జు (37): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వెడ్మా బొజ్జుపటేల్ అనూహ్యంగా గెలుపొందారు. భాజపా నుంచి మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్, భారాస నుంచి ఎన్నారై భూక్యా జాన్సన్‌లతో పోటీపడినా ఓటర్లు మాత్రం బొజ్జుకే పట్టంకట్టారు.
 - లాస్య నందిత (38): దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె అయిన నందిత కంటోన్మెంట్ నుంచి భారాస అభ్యర్థిగా పోటీచేసి, స్థానికంగా గుర్తింపు ఉన్న శ్రీగణేష్(భాజపా)పై గెలిచారు.
 - కల్వకుంట్ల సంజయ్(47): స్పైన్‌సర్జన్ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్(భారాస) కోరుట్లలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(భాజపా)పై గెలిచారు.
 - కుందూరు జైవీర్‌రెడ్డి (48): నాగార్జునసాగర్‌లో జైవీర్‌రెడ్డి(కాంగ్రెస్)... సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్ (భారాస)పై గెలిచారు.
 
         Read latest  
                Politics  News             and  Telugu News
    
    
    
    
        Tags : 
        
    
    
    
    
    
        Published : 04 Dec 2023 07:30 IST    
    
    Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 


