కేంద్ర బిల్లులకు మద్దతివ్వడమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులన్నింటికీ మద్దతునివ్వాలని తమ పార్టీ ఎంపీలను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించడం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టదాయకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

Published : 05 Dec 2023 04:49 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులన్నింటికీ మద్దతునివ్వాలని తమ పార్టీ ఎంపీలను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించడం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టదాయకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎంపీలు కృషి చేయాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కోరారు. ‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధనకు వైకాపా, తెదేపా ఎంపీలు కృషి చేయాలి. ప్రజలకు నష్టం చేసే స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు నిబంధనతో పాటు విద్యుత్తు సంస్కరణ బిల్లును తిరస్కరించాలి. రాష్ట్రాభివృద్ధికి, కరవు సహాయానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలి’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని