రాజధాని అమరావతేనని కేంద్రం చెప్పినా వినరా: సీపీఐ, సీపీఎం

అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం గుర్తించిన నేపథ్యంలో సీఎం జగన్‌ రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాలు మానుకోవాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

Published : 05 Dec 2023 04:50 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం గుర్తించిన నేపథ్యంలో సీఎం జగన్‌ రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాలు మానుకోవాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ‘అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదించినట్లు కేంద్రం వెల్లడించింది. ఎంపీ జావెద్‌ అలీఖాన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ అమరావతే ఏపీ రాజధానిగా పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరాలి’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు