తుపాను ఉపశమన చర్యలకు రూ.5 వేల కోట్లు ఇవ్వండి: గల్లా జయదేవ్‌

మిగ్‌జాం తుపానుతో రాష్ట్రంలో పంటలు, రహదారులు, భవనాలు ధ్వంసమయ్యాయని, విద్యుత్‌ స్తంభాలు నెలకూలి సరఫరాకు అంతరాయం కలిగినందున తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టేందుకు రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు.

Published : 06 Dec 2023 05:18 IST

ఈనాడు, దిల్లీ: మిగ్‌జాం తుపానుతో రాష్ట్రంలో పంటలు, రహదారులు, భవనాలు ధ్వంసమయ్యాయని, విద్యుత్‌ స్తంభాలు నెలకూలి సరఫరాకు అంతరాయం కలిగినందున తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టేందుకు రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. మిగ్‌జాం తుపానుతో రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాలు అంచనా వేసే పనిలో ఉందని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు. రాష్ట్రంలో పంటలతో పాటు వివిధ రకాల ఆస్తులకు నష్టం వాటిల్లినందున తక్షణమే నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావం తగ్గిపోగానే నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపాలని ఆయన కోరారు. ఆ బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాలని ప్రధానమంత్రికి జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని