‘పాలమూరు-రంగారెడ్డి’ పనులను పూర్తి చేయాలి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం సమీక్ష చేసి.. మిగిలిన పనులను తమ కంటే వేగంగా పూర్తి చేయాలని భారాస నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 22 Feb 2024 04:14 IST

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం సమీక్ష చేసి.. మిగిలిన పనులను తమ కంటే వేగంగా పూర్తి చేయాలని భారాస నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, క్రీడాప్రాధికార సంస్థ మాజీ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కృష్ణా, తుంగభద్ర నదులే పాలమూరుకు జీవనాధారం. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జూరాలను నిండుగా నింపుకొన్నాం. కేసీఆర్‌ ప్రభుత్వం తీర్చిదిద్దిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 7-10 శాతం పనులే మిగిలిపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం భేషజాలకు పోయి.. కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేస్తే కొడంగల్‌, నారాయణపేటకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో చిక్కమంచిలి వద్ద మరో రిజర్వాయర్‌ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలి. కానీ, కాళేశ్వరంపై విషం చిమ్ముతోంది. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌పైనా బురద చల్లుతోంది’’ అని నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని