బలహీనపడిన భారాస.. ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్‌

రాష్ట్రంలో భారాస పూర్తిగా బలహీనపడిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అనతికాలంలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు.

Published : 24 Feb 2024 03:55 IST

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో భారాస పూర్తిగా బలహీనపడిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అనతికాలంలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. శుక్రవారం కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ హామీల అమలుకు తగిన బడ్జెట్‌ లేదని ప్రజలకు అర్థమైంది. మోదీ మళ్లీ ప్రధాని కావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కరీంనగర్‌లోనూ కమలం గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. అన్ని సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భాజపా కార్యకర్తలు, నాయకులు గ్రామగ్రామానికి వెళ్లి కేంద్ర పథకాలు, మోదీ సాధించిన విజయాలను ప్రజలకు గుర్తు చేయాలి’ అని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని