ఖమ్మం నుంచే పోటీ చేసి తీరుతా: వీహెచ్‌

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి తీరుతానని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు.

Published : 27 Feb 2024 06:16 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి తీరుతానని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. పార్టీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత అంతగా కష్టపడేది తానేనన్నారు. అధిష్ఠానం తప్పకుండా తన కృషి గుర్తించి టికెట్‌ ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇస్తే తన లాంటి సీనియర్‌ నాయకుల పరిస్థితేంటని ప్రశ్నించారు. మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు జరిగితే వెళ్లడానికి తీరిక లేని ప్రధాని మోదీకి..సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేసే సమయం మాత్రం దొరుకుతుందని విమర్శించారు. దేశానికి ఏం చేశారని భాజపా నాయకులు విజయ సంకల్ప యాత్రలు చేస్తున్నారని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని