Nellore: వైకాపాకు డిప్యూటీ మేయర్, నలుగురు కార్పొరేటర్ల రాజీనామా

నెల్లూరులో వైకాపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తో పాటు నలుగురు కార్పొరేటర్లు రాజీనామా చేశారు.

Updated : 28 Feb 2024 12:27 IST

నెల్లూరు: నగరంలో వైకాపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు రాజీనామా చేశారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా రూప్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పరిణామాలు బాధించాయని చెప్పారు. ‘‘వైకాపా ఆవిర్భావం నుంచి సేవ చేశాను. పార్టీ కోసం కష్టపడ్డాం.. పోరాడాం.. మాది అనుకున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నాం. నన్ను ఆదరించిన నెల్లూరు నగర ప్రజలు, నాయకులకు కృతజ్ఞతలు. భవిష్యత్‌ కార్యాచరణపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను’’ అని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని