దేశంలో పదేళ్లుగా బెయిల్‌పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్‌

ఈడీని అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రధాని మోదీ చూస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు.

Updated : 29 Feb 2024 06:28 IST

సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపణ

ఈనాడు, దిల్లీ: ఈడీని అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రధాని మోదీ చూస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఆయన బుధవారం ఇక్కడ ఏపీ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. రూ.100 కోట్ల మద్యం కుంభకోణం పేరుతో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం రూ.45 వేల కోట్ల అవినీతి కేసులను ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని మాత్రం ఏమీ చేయడం లేదని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి పదేళ్లుగా బెయిల్‌పై బయట ఉండటం దేశంలో ఇదే తొలిసారని అన్నారు. మోదీ, అమిత్‌షాలకు జగన్‌ మోకరిల్లడమే కారణమని ఆరోపించారు. ఇప్పుడు సెక్షన్‌ 17-ఏను అడ్డుపెట్టుకొని భాజపా నాయకులు చంద్రబాబునాయుడిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీల అమలును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టినా ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతలు ప్రశ్నించే ధైర్యం చేయడంలేదన్నారు. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం కలిసి తిరుపతి, విశాఖపట్నం, అమరావతిల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు నారాయణ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని